రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం
కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే మోడీ కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి
ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి డాక్టర్ సీతక్క
ములుగు, వెంకటా పూర్ మండలాలోని బండారు పల్లి,ములుగు, వెంకటా పూర్ మండలం లోని నర్సాపూర్ కేశవ పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్ళి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని గెలిపించాలని అభ్యర్థించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయసీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పేదల కోసం పొట్లాడే రాహుల్ గాంధీ బడ వ్యాపారులకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే నరేంద్ర మోడీ కి మధ్య జరుగుతున్న ఎన్నికలు
లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర పన్నుల పేరుతో వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన మోడీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని
రాహుల్ గాంధీకావాలను
కుంటే యూపీఏ UPA పదేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవారని, కానీ ఏనాడూ ఆయన పదవిని ప్రేమించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను ప్రేమించడం, ప్రజలందరిని కలిపి ఉంచడమే ఆయన లక్ష్యమన్నారు కావున ప్రజలు ప్రజాస్వామిక వాదులు యువకులు విద్యార్థులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ కి ఓటు వేసి రాహుల్ గాంధీ కి తోడుగా పార్లమెంట్ కు పంపాలి అని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు