SAKSHITHA NEWS

గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ
రాజ్ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు*
ర్యాలీ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు*
అక్రమ అరెస్ట్ లు చేసి మా పోరాటాలను ఆపలేరు*
నిరసన తెలిపే హక్కు లేదా*
కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన – సీతక్క


సాక్షిత : హైదరాబాద్ లో
దేశంలో ప్రధాని మోడీ ఆధాని కి దేశ సంపద దోచి పెట్టి అక్రమాలకు పాల్పడిన అంశాలపై, ఆధాని షేర్ల పతనం, అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోని కాపాటలిజం కు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆద్వర్యంలో చలో రాజభవన్ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ


ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సి,విమానయాన, సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది
మోడీ ప్రభుత్వం ఆధాని అంబానీ ప్రభుత్వం
కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషిస్తున్న మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం గా తయారైంది
దేశం లో రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు నొక్కే నిచ సంస్కృతి బిజెపి ది
2014 లో అధానీ ప్రపంచ కుబేరుల లో 609 వ స్థానం ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం లో అధానీ ఉన్నాడు
పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న మోడీ కి ప్రజలే బుద్ది చెప్పడం ఖాయమని
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యడం మోడీ కి ఇష్టం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు మోడీ
గ్యాస్ సిలిండర్,పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారు అని సీతక్క అన్నారు


SAKSHITHA NEWS