SAKSHITHA NEWS

కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ….. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

రైతు రుణమాఫీ పై ఏకగ్రీవ ఆమోదం పట్ల హర్షం,
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం లో పాల్గొన్న చిన్నారెడ్డి

సాక్షిత వనపర్తి జూన్ 23
కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులపార్టీ,, రైతుల పక్షపాతి అని ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన పంట రుణమాఫీ పై నేడు క్యాబినెట్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని రైతుల పక్షపాతని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు రైతు పంట రుణమాఫీ పై మంత్రిమండలి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షిస్తూవనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పాల్గొని ముఖ్యమంత్రి ఏవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ పై నేడు నిర్ణయం తీసుకోవడం జరిగిందని గత ప్రభుత్వ హయాంలో విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రుణమాఫీ చేయడం హర్షించే విషయం మని గతంలో కూడా రైతుల కు లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారిరుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ కమ్మర్ మియా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ చీరల జనార్ధన్ చిన్న రాములు కోల వెంకటేష్ కౌన్సిలర్ పద్మ పరశురాం అత్తర్ ఆనిష్ మెంటేపల్లి రాములు దివాకర్ రోహిత్ జానకి రాములు వెంకటేశ్వర్ రెడ్డి దాశరాజుల భాస్కర్ అబ్దుల్లా ఎల్లయ్య కుమ్మరి గోవిందు విష్ణువర్ధన్ రెడ్డి మసికొండ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS