ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : ఐ డి పి ఎల్ నుండి గండిమైసమ్మ వైపు నడిపించే ఆటో డ్రైవర్ల సమావేశం నేడు ఐడీపీఎల్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు గతంతో పోలిస్తే ప్రయాణికులు తగ్గరని దానితో ఆటో డ్రైవర్లు నెల వారిగా కట్టాల్సిన డబ్బులు కట్టలేక పోతున్నారని కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులు చేకూరేలా పథకాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు. అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైసెన్సు జారీ చెయ్యాలని,ట్రాఫిక్ వారి చాలన్లు తగ్గించాలని, ఇన్సూరెన్స్ ప్రీమియం , టాక్స్ లను తగ్గించాలని కోరారు.పై డిమాండ్లతో రానున్న రోజుల్లో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరమయ్యేలా చూస్తామని దానికి డ్రైవర్లు కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఆటో యూనియన్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించామని ఇప్పుడు కూడా అదే తరహాలో పోరాటాలు సాగించి కార్మిక రాజ్యం స్థాపించుకుందామని దానికి సీపీఐ ఏఐటీయూసీ ఎల్లవేళలా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. జనవరి 26 న ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కుమార్,రాజు,గౌస్,ఎల్లస్వామి,శివ,బాలచందర్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.