శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా,చెరువులు అన్యాక్రాంతం విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి.ఏ.రేవంత్ రెడ్డి ని కలిసి విన్నవించినా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రజాపాలన ప్రజల విశ్వశనికి తగ్గట్టు పరిపాలన సాగిస్తుందని,ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు పర్యటించిన ప్రతి కాలనీ/బస్తిలో ప్రజలు మీ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రజలలో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని,ఇలానే ప్రజలలో ఉంటూ ప్రజలకు అన్ని పథకాలు అందేలా కార్యకర్తలను ముందుండి నడపాలని సీఎం సూచించారు..