SAKSHITHA NEWS

కాంగ్రెస్ రైతు రుణ మాఫీ బోగస్

రైతులకు రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతాం.

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రైతంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడుతామని మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు..

బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నగర శాఖఅధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రైతు ధర్నా నిర్వహించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్ హాజరైనారు..మొదట దర్నా కార్యక్రమం ఆవరణలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు…

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 2023 శాసనసభ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం గాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్… రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకే దఫాలో చేస్తా అని చెప్పి రైతులు వెంటనే వెళ్లి రెండు లక్షల రుణం తెచ్చుకొమ్మని చెప్పి చేతులెత్తేసిందని ..రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని అన్నారు .

కాంగ్రెస్ రుణమాఫీ మొత్తం పంట రుణాలు – రూ. 49,500 కోట్లు అయితే కాంగ్రెస్ అంచనా వేసింది – రూ. 40,000 కోట్లు ..క్యాబినెట్ లో చెప్పింది – రూ. 31,000 కోట్లు..బడ్జెట్‌లో పెట్టిన నిధులు – రూ. 26,000 కోట్లు..విడుదల చేశామన్నది – రూ. 17,933 కోట్లు చివరకు తెలంగాణ రైతులకు చేరింది – రూ. 7,500 కోట్లు అని తెలిపారు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయిందని ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. 6 గ్యారంటీలు కూడా సరిగా అమలు కావడం లేదని ఫ్రీ బస్సు మాత్రం కేవలం 33% అయిందని అన్నారు..

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ది .. క్యాబినెట్ మంత్రుల తీరు పొంతన లేకుండా ఉందని . రేవంత్ రెడ్డి 2లక్షల రుణమాఫీ పూర్తిగా చేశాంటారు. ఆయన మంత్రివర్గంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి రుణమాఫీ కాలేదని అంటారు… నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 49 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది కానీ 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ఒప్పుకున్నారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రూ.7,000 కోట్ల రుణమాఫీ జరిగిందని బ్యాంకర్ల సమావేశంలో అన్నారు. ..ఎవరి మాట నమ్మాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రులంతా కలిసి తెలంగాణ రైతంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ కు భయపడే ప్రసక్తే లేదని ఇది ఉద్యమాల గడ్డ. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదని…రైతులకు పూర్తి రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తూ రైతులకు అండగా నిలుస్తాం అని అన్నారు…కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేశాని. 11 విడతల్లో 70 వేల కోట్లు రైతు బంధు ఇచ్చారని అన్నారు కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఆగస్టు నెలలో 44 వేల చెరువులు కుంటలు మత్తళ్ళు దూకాయని ..కానీ.. ఇప్పుడు నాలుగు చెరువులు కూడా నిండలేదని అన్నారు .. గ్రామీణ ప్రాంతాల్లోని కరెంటు, నీళ్లు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ..రైతులు బిఆర్ఎస్ ప్రభుత్వన్నీ ఎందుకు కోల్పోయామని.. ఐదేళ్లు ఎలాగడుస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు …కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని వరికి బోనస్ ఇస్తానని చెప్పి, ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని చెప్పి రైతులను మోసం చేస్తూన్నారని.రైతులనే కాదు, అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని …మే చివరి వారం తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధు కోతలు కోసే సమయంలో రైతు బంధు ఇస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు..

ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు , సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ,నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ,నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ , ఫ్యాక్స్ చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి ,తోట తిరుపతి ,కాసారపు శ్రీనివాస్ , జమీలుద్దీన్, కార్పొరేటర్లు గందే మాధవి ,ఎడ్ల అశోక్,బోనాల శ్రీకాంత్ , మహిళా నాయకురాలు కర్రెపావని ,బత్తిని కీర్తి లత ,రుద్ర రాధ ,గంటల రేణుక ,గంగాధర చందు ,సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS