హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్ పేరును ప్రస్తావించారు. ఆ ఐఏఎస్ అధికారి.. బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారు.
నార్సింగిలోని వివాదాస్పద భూమికి సంబంధించి శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. నార్సింగిలోని ఓ ప్రాజెక్టు అనుమతి కోసం ఐఏఎస్ ఏకంగా రూ.10కోట్లు డిమాండ్ చేయగా.. స్థిరాస్తి వ్యాపారి ఆ మొత్తంలో మొదటగా రూ.కోటి చెల్లించారు. గత డిసెంబరులో బాలకృష్ణ ద్వారా అధికారికి కోటి రూపాయలు చేరాయని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాలపై ఏసీబీ అధికారులు మరింతలోతుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు.