తెలంగాణలో జరుగనున్న సమగ్ర కులగణన సమీక్షా సమావేశంలో భాగంగా బోయిన్ పల్లి లో జరుగనున్న సమీక్షా సమావేశానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,అభిమానులతో కలిసి భారీ వాహన శ్రేణితో బయలుదేరిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రారంభించనున్న సమగ్ర కులగణనపై ప్రజలు, మేధావులు, పౌర హక్కులు, విద్యార్థి, కుల సంఘాల నేతలు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి హైదరాబాద్ విచేయనున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఘన స్వాగతం పలకడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి బయలు దేరడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణన చేపట్టడం చాలా గొప్ప విషయం అని, ఎన్నో ఏండ్ల కళ నెటీతో నెరవేరునని , సమగ్ర కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.