SAKSHITHA NEWS

సాక్షిత ; స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మధ్యాహ్నం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఏయే ప్రాజెక్టులు పనులు ఏ స్టేజిలో ఉన్నాయని, ఎందుకు ఆలస్యం అవుతున్నాయని విషయాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మీరు పనులు చేసిన వెంటనే బిల్లులు ఇస్తున్నామని, నిధులతో కొరత లేదని ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. శ్రీనివాస సేతు , వినాయక సాగర్ ను ముఖ్యమంత్రి చే ప్రారంభించేందుకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

మిగిలిన ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డి. ఈ.లు విజయకుమార్ రెడ్డి, మోహన్, మేనేజర్ చిట్టిబాబు, ఏఈకామ్ ప్రతినిదులు బాలాజీ, బాలచంద్ర, అనిల్, అఫ్కాన్స్ ప్రతినిథి స్వామి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS