SAKSHITHA NEWS

దివ్యంగులకు అండగా భరోసా కల్పించిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం….

దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అందిస్తూ గౌరవంగా జీవించేలా చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్…..

100శాతం సబ్సిడీతో దివ్యంగులకు ఉచితంగా ఉపకరణాల అందజేత….

దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అందరూ అండగా ఉండి మూడోసారి కేసీఆర్‌ ని ముఖ్యమంత్రి చేయాలని వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ విజ్ఞప్తి చేశారు.

ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ రోడ్డులోని సత్యం గార్డెన్స్ లో వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉమ్మడి ఆంధ్రప్రశ్‌లో దివ్యాంగులు అనేక కష్టాలు పడ్డారని, తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు అండగా నిలిచారన్నారు. కేసీఆర్‌ ముందుగా పింఛన్‌ను ఒకేసారి 200వందల నుండి 2వేలకు పెంచారన్నారు. ఆ తర్వాత మళ్లీ 3వేలకు పెంచి, మొన్న 4016 చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్‌ను 6వేలకు పెంచుతామని తెలిపారు. అంతేకాకుడా దివ్యాంగులకు గృహలక్ష్మి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. దేశ ప్రజలందరూ కేసీఆర్‌ వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, నాయకులు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 23 At 5.32.37 Pm

SAKSHITHA NEWS