Complete smart street works quickly
స్మార్ట్ స్ట్రీట్ పనులు త్వరగా పూర్తి చేయండి.
*కమిషనర్ అనుపమ అంజలి.
సాక్షిత : స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.
సోమవారం ఇంజినీరింగ్, అప్కాన్స్, ఏఈకామ్ అధికారులతో కలిసి శ్రీనివాస సేతు కు ఇరువైపులా చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ పనులను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ స్ట్రీట్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఫుట్ పాత్ లు ఇంకా పెండింగ్ ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. అలాగే శ్రీనివాస సేతు పిల్లర్ల మధ్యలో నాటిన మొక్కలను కత్తిరించి, మధ్యలో పూల మొక్కలు నాటాలన్నారు
. ఏపుగా పెరిగిన మొక్కలను అందంగా ఉండేలా కత్తిరించి, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపైన ఎక్కడా నీరు నిలవకుండా డ్రైనేజీ కాలువలు నిర్మించాలన్నారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, డి.ఈ.మోహన్, శానిటరి సూపర్ వైజర్ చెంచయ్య, అప్కాన్స్ స్వామి, ఏఈకామ్ ప్రతినిధులు ఉన్నారు.