అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువలు త్వరగా పూర్తి చేయండి.
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి, తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా, వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, వారధి నిర్మాణ పనులు, జరిగిన సమయంలో కొన్ని మురుగునీటి కాలువ పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
ఈ కాలువల వలన వర్షపు నీరు వెళ్ళడం లేదని, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగు, తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువు లోపు పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈ.ఈ.చంద్రశేఖర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ.లు రాజు, రమణ, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏ.సి.పి.లు బాలాజి, రమణ, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.