రాత్రి బస కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పట్నూల్ వీధిలో గల రాత్రి బస కేంద్రం (నైట్ షెల్టర్) ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేంద్రంలో కల్పిస్తున్న మౌళిక వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురిని పలకరించి ఎక్కడ నుండి వచ్చారు, వసతీ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో బస చేస్తున్న వారికి అందించే భోజనాన్ని కమిషనర్ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిషనర్ మాట్లాడుతూ కేంద్రంలో నాణ్యమైన భోజన వసతి, వైద్య సదుపాయాలు బాగా ఉండేలా చూడాలన్నారు. అలాగే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచాలు, బెడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇక్కడ బస చేస్తున్న వారికి ఎటువంటి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, మెప్మా సి.ఎం.ఎం. కృష్ణవేణి, హెూప్ సంస్థ ప్రతినిధి కవిత, తదితరులు ఉన్నారు.
రాత్రి బస కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
Related Posts
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
SAKSHITHA NEWS గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి నాదెండ్ల:గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం గణపవరం ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు వద్ద బుధవారం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లుకు దారాన్ని లోడ్ చేసుకునేందుకు వచ్చిన…
భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను
SAKSHITHA NEWS భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను పరిచయం చేసే వీరుల స్మరణజనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న బాలాజి చిలకలూరిపేట: నాటి పలనాటి పౌరషాన్ని, వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ శతాబ్దాల నుంచి పల్నాటి…