SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగర ప్రజల సహకారంతో అధికారులు, సిబ్బంది కృషితో స్వచ్చ సర్వేక్షన్ విషయంలో మొదటి ర్యాంక్ సాదించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆ ర్యాంకును నిలబెట్టుకోవడంతో బాటు మరింత మెరుగైన పని తీరును సాదించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్చ సర్వేక్షన్ పై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగ నగరపాలక సంస్థ ప్రజలను చైతన్యం చేయడంతో బాటు సిబ్బంది కృషితో క్లీన్ సిటీగా సిద్ధం చేయడం ద్వారా ఈ సంవత్సరం కేంద్ర నిబందనలు చేరుకొని మొదటి ర్యాంకింగును చేరుకోవడం జరుగుతుందని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ విశ్వాసం వ్యక్తం చేసారు. నగరంలో శానిటేషన్ శుభ్రత కోసం 102 ఆటోలను అన్ని డివిజన్లకు కేటాయించడం జరిగిందని, శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటి నుండి తడి,పొడి చెత్తను విడివిడిగా తీసుకొని తూకివాకం ప్లాంట్ కి పంపిస్తే అక్కడ వాటిని రీ సైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు.

ముఖ్య సర్కిల్స్ వద్ద ఏర్పడుతున్న ఐలాండ్స్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, మెయిన్ డ్రైన్ లలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కట్టడికి కృషి చేయాలని, మునిసిపల్ వర్కర్స్ కి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కమిషనర్ హరిత విజ్ఞప్తి చేస్తూ తిరుపతిని క్లీన్ సిటీగా వుంచుకొనెందుకు సహకరించాలని, మీ ఇండ్ల వద్దకే వస్తున్న శానిటరీ సిబ్బందికి తడి పొడి చెత్తలను విడి విడిగా అందించాలని, కాలువల్లో వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ బాటిల్స్ ను వేయకుండా మునిసిపల్ సిబ్బందికి అందించేలా సహకారం ఇవ్వాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చ సర్వేక్షన్లో ర్యాంక్ సాదించేలా అందరం‌ కలిసి సమన్వయంతో పని చేద్దామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజీవ్ కుమార్, గోమతి, మహేష్, నరేంధ్ర, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి, శానిటరి ఇన్స్ పెక్టర్లు, మేస్త్రీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS