SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగరంలోని సమస్యలపై పిర్యాధు చేసే డయల్ యువర్ కమిషనర్, అదేవిధంగా స్పందన కార్యక్రమానికి వచ్చే పిర్యాధులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారుల‌కు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ దామలచెరువు హరిత తెలిపారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పిర్యాదులను స్వీకరించారు. పిర్యాదులను కమిషనర్ హరిత పరిశీలించి, వాటిని పరిష్కరించమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. స్పందన కార్యక్రమంలో మొదటగా డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సిమెంట్ ప్లోరింగ్ వేయించాలని, పన్నులు చెల్లించే కేంధ్రం వద్ద షామియాన, కుర్చిలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, కార్పొరేటర్ ఎస్.కె.బాబు వినతిపత్రం ఇస్తూ తిరుపతి నగరంలోని ఆనాధ శవముల దహనక్రియలకు వైకుంఠ రథం ఏర్పాటుచేయాలని, అదేవిధంగా ఎస్.కె.బాబు, కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ భాష, ఈద్గా కమిటి ప్రతినిధులు షఫి అహ్మధ్ ఖాధ్రి, ఇమ్రాన్, గఫూర్ కమిషనర్ హరితకి వినతిపత్రం సమర్పిస్తూ రంజాన్ సంధర్భంగా ఈద్గా మైదానంలో పందిళ్ళు వేసి నీటి సౌకర్యం కల్పించాలన్నారు.

అదేవిధంగా 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి వినతిపత్రం ఇస్తూ తమ డివిజన్ పల్లివీధి మెయిన్ రోడ్డులో కోర్టు సముదాయాల నుండి బేరివీధి వరకు గల పెద్ద కాలువ నిండిపోయి మురుగునీరు ప్రవహిస్తున్న దని, ఆ కాలువలో సీల్ట్ తీయించాలన్నారు. ఎన్జివొ కాలనీ నుండి వచ్చిన పిర్యాదులో ఆదివారం చెత్త సేకరణకు రావడం లేదని, పికె లే అవుట్లో రోడ్డు గుంతలమయమని, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా వున్నాయి తొలగించమని, పి.ఎల్.ఆర్ కళ్యాణమండపం వెనుక తెలుగుగంగ నీరు గత కొన్ని నెలలుగా సరిగా రావడం లేదని, నెహ్రూ నగర్లోని తమ ఇంటి ముందర చెత్త వేస్తున్నారని, చెత్తబండి సరిగా రావడం లేదని, తిమ్మినాయుడు పాళెం వద్దనున్న సన్ రైజ్ అపార్ట్మెంట్ వద్ద మురుగునీరు వెల్లడానికి కాలువలు నిర్మించాలని, క్రైం పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్డు గుంతలమయమని, అన్నపూర్ణమ్మ గుడి ముందర రోడ్డును మరమ్మత్తులు చేయించమని, రైల్వే కాలనీలో కుక్కలు, ఆవులు ఎక్కువగా తిరుగుతున్నాయనే డయల్ యువర్ కమిషనర్ కి 17, స్పందన కార్యక్రమానికి వచ్చిన 26 పిర్యాధులపై స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హరిత పిర్యాధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత,ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్,రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ,హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ,ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, దేవిక, గోమతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం,మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS