సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ట్యాబులను పంపిణి చేసిన అనంతరం కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తి చేయడం జరిగిందని, తిరుపతి కార్పొరేషన్ పరిధి 27 స్కైర్ కిలో మిటర్లు, 1800 ఎకరాల్లో, 5 రెవెన్యూ విలేజెస్లో కవర్ అయ్యిందని తెలిపారు. రీసర్వే ప్రకియలో వార్డు సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా అడ్మిన్ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు, విఆర్వోలు అందరూ కూడా వాళ్ళ సచివాలయ పరిధిలో ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి, ఎంత ఏరియా ఉంది, ఎన్ని ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ లు ఉన్నాయనే డేటా ఎంట్రీ వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు.
ఇటీవలే మనకు డ్రోన్ సర్వే పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇకనుండి ఫీల్డ్ కి వెళ్లి అక్కడ డేటా తీసుకున్న తర్వాత మళ్లీ సచివాలయానికి వచ్చి కంప్యూటర్ లో ఎంటర్ చేయకుండా ఎక్కడికి అక్కడే ఆన్‌లైన్ డేటా ఎంట్రీ జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆర్తో రెక్టిపైడ్ ఇమేజ్ (ఓ.ఆర్.ఐ) వచ్చిన వెంటనే రీ సర్వేని వేగవంతం చేయడానికి నగరపాలక సిబ్బంది, అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా కృషి చేయడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, సుపర్డెంట్లు హాసిమ్, రవి, ప్లానింగ్ సిబ్బంది సాయిలీలా, శారధాంబా, జగధీష్ రెడ్డి పాల్గొన్నారు.*