SAKSHITHA NEWS

సాక్షితతిరుపతి : ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికే మనం నిర్వహిస్తున్న డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమని అధికారులకు చెబుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పిర్యాదులను స్వీకరించారు. పిర్యాదులను కమిషనర్ పరిశీలించి, వాటిని పరిష్కరించమని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గతంలో వచ్చిన పిర్యాధులపై కమిషనర్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలను పరిష్కరించారు, ఇంకా పరిష్కరించాల్సిన వాటిపై పిర్యాధిదారులకు సమాచారం ఇచ్చి వాటిని కూడా త్వరగా పరిష్కరించాలన్నారు.

నేటి పిర్యాధులను పరిశీలిస్తూ సంజీవయ్యనగర్లో త్రాగునీటి సమస్య వున్నదని, త్రాగునీరు మురికినీటితో కలుస్తున్నదని, సత్యనారాయణ పురం నుండి త్రాగునీరు సక్రమంగా రావడం లేదని, నీటి సరఫరా తక్కువగా వున్నదనే పిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ తగిన చర్యలు చేపడుతామన్నారు. చింతలచేను ముత్యాలమ్మ గుడి వద్ద రోడ్డుకు ఇరువైపులా ఆక్రమిస్తున్నారని, ఉప్పంగి హరిజనవాడ తాళ్ళపాక అపార్ట్‌మెంట్ వద్ద రోడ్డును ఆక్రమించి బంక్కును ఏర్పాటు చేసారని, ఐ.ఎస్.మహాల్ సర్కిల్ వద్ద మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నదని, ఇందిరానగర్లో కొత్త కాలువలు నిర్మించాలని, ఎస్టివి నగర్లో సక్రమంగా నీరు వదలడం లేదని అదేవిధంగా నీరు కలుషిత మవుతున్నదని, చేపల మార్కెట్ వద్దనున్న వినాయక ఆలయం దగ్గర చెత్త ఎక్కువ వేస్తున్నారనే డయల్ యువర్ కమిషనర్ కి 10, స్పందన కార్యక్రమానికి వచ్చిన 35 పిర్యాధులపై స్పందిస్తూ అతి త్వరగా తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హరిత ఐఏఎస్ పిర్యాధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత,ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ,హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ,ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఫైర్ ఆఫిసర్ శ్రీనివాసరావు, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి,సంజీవ్ కుమార్, మహేష్, గోమతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS