సాక్షిత : *తిరుపతిలో శనివారం నుండి ప్రారంభమయ్యే జగనన్న సురక్ష కార్యక్రమం ఎన్.జి.ఓ కాలనీ క్యాంపును తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ శుక్రవారం పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. తిరుపతి నగరంలోని 40 డివిజన్ 1,2 సచివాలయాలను కమిషనర్ హరిత పరిశీలిస్తూ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం కుర్చీలు, త్రాగునీరు అందుబాటులో వుంచడం, ఎండవేడికి షామియానాలు వేయించడంతో బాటు సర్టీఫికెట్ల వారికి అందించేందుకు క్యాబిన్లు సిద్దం చేయాలన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని ప్రజలకి అవసరమైన సర్టిఫికెట్లను శనివారం జరిగే క్యాంపులో అందించడం జరుగుతుందన్నారు. సర్టిఫికెట్స్ పొందుతున్న వారికి సమాచారం ఇచ్చి క్యాంపుకు తీసుకురావలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. శనివారం తిరుపతిలోని ఎన్.జి.ఓ కాలనీ, చెన్నారెడ్డి కాలనీ, ప్రకాశమ్ పార్క్ వద్ద మూడు ప్రాంతాల్లో జరిగే క్యాంపుల్లో ఇప్పటికే గత వారం రోజుల నుండి ధరఖాస్తులు చేసుకున్న ప్రజలకి అవసరమైన ప్రభుత్వ సర్టిఫికెట్లు ఎలాంటి రుసుము తీసుకోకుండా అందించడం జరుగుతుందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ గోమతి, సుపర్డెంట్ రమేష్ పాల్గొన్నారు.
జగనన్న సురక్ష క్యాంపును పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…