సాక్షితతిరుపతి : ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు సహాయపడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ రామచంధ్రానగర్ ఏరియాలో సచివాలయ సిబ్బంది జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏవిధంగ చేపడుతున్నారని కమిషనర్ హరిత వెల్లి పరిశీలించడం జరిగింది.
ఈ సంధర్భంగా కమిషనర్ హరిత సచివాలయ సిబ్బందికి సూచనలు చేస్తూ ప్రతి ఇంటికి వెల్లి, ఆ ఇంట్లో వాళ్ళు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులై వుండి కూడా పథకాలను పొందలేక పోతున్నారా అని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాంటి వారిని గుర్తించి పథకాలకు అవసరమైన సర్టిఫికెట్స్ వారి వద్ద లేకపోతే ధరఖాస్తు చేయించాలన్నారు. ఇంకా ఎవరికైన ప్రభుత్వం మంజూరు చేస్తున్న సర్టిఫికెట్స్ అవసరమనుకుంటె వారి చేత దరఖాస్తు చేయించి ఉచితంగా అందించాలన్నారు. ప్రజల దరఖాస్తులను పరిశీలించి వారికి అర్హులైన వారికి సర్టిఫికెట్స్ ను సిద్దం చేయించి, మీ ఏరియా పరిధిలో మీకు కేటాయించిన తేదిలో జరిగే క్యాంపుకు వారిని ఆహ్వానించి సర్టిఫికెట్స్ ను అందజేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడిన తరువాత వారి ఫొటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలియజేసారు. కమిషనర్ వెంట డి.ఎఫ్.ఓ. శ్రీనివాసరావు, సెక్రెటరీలు, వాలంటీర్లు ఉన్నారు.*