సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి విజయ శేఖర్ తో కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనారు. నగరపాలక సంస్థలకు, మునిసిపాలిటీలకు ఆర్ధిక వనరులు సమకూర్చుటకు అవసరమైన ఫైనాన్స్ అందించేందుకు తమ వరల్డ్ బ్యాంక్ చేయుత నిస్తుందని, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి విజయ్ భాస్కర్ తెలపడం జరిగింది. చేపట్టబోయే ప్రాజెక్టుల విలువ, వాటి ఆవస్యకత, వాటి ద్వారా నిధులు తిరిగి ఎలా వస్తాయి అనే విషయాలను తెలుసుకొని తమ సంస్థ చర్చించి నిధులు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఓక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పడం జరిగింది. కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్దికి, ప్రజా అవసరాల కోసం నగరంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి అయితే కార్పొరేషన్ కి ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లు రావడం వలన ఆయా ప్రాంతాల్లో ఇళ్ళులు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, షాపులు రావడం వలన పన్నుల రూపంలో నగరపాలక సంస్థకు ఆదాయాలు సమకూర్తుందన్నారు. మల్టి లెవల్ కార్ పార్కింగులు పూర్తి అయితే కూడా ఆదాయం వస్తుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ వలన వచ్చే ప్రయోజనాల గురించి కూడా ప్రజేంటేషన్ ద్వారా చర్చించడం జరిగింది. పెద్ద ప్రాజెక్టులు చేపడితే వాటికి అవసరమైన ఫైనాన్స్ అందించేందుకు కావాల్సిన మార్గాలు, వాటికి సంబంధించిన విషయాల గురించి చర్చించడం జరిగింది.
అదేవిధంగా ఓక ప్రాజెక్ట్ చేపట్టిన తరువాత దాని ద్వారా సామాజిక, ఆర్ధిక లాభాలు ఏముంటాయి, ప్రజలకు ఉపయోగ పడుతాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, రానున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ వారితో మరింతగా చర్చించి ప్రజా ప్రయోజన ప్రాజెక్టులకు అవసరమైన ఫైనాన్స్ స్థితి గతులపై చర్చించడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, గోమతి, దేవిక, మహేష్, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.*