SAKSHITHA NEWS

Commissioner Anupama inspected the constructions of Jee Palem Jagananna

జీ పాళేం జగనన్న నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ అనుపమ

సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ జీ పాళెం జగనన్న లే అవుట్ ను తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి శనివారం పరిశీలించారు. అనుకున్న మేరకు పనులను చేపట్టి సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయాలని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగ జరగబోవు గృహప్రవేశాలకు ఇళ్ళను సిద్దం చేయాలని కమిషనర్ అనుపమ అన్నారు.

తిరుపతి అర్భన్ నివాసితులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జీ పాళెంలో ఇళ్ళ నిర్మాణాలకు ముందుకొచ్చిన లబ్ధిదారుల సహకారంతో ఇరవై ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేస్తున్నట్లు డిఈ మహేష్ కమిషనర్ కి వివరించారు.

అదేవిధంగా సుమారు వంద ఇళ్ళ స్థలాలు కేటాయించినా కూడా ఆ స్థలాల్లో లీగల్ గా ఇబ్బందులు రావడంతో వారికి ఆ లే అవుట్లలోనే సర్వేలు నిర్వహించి కొత్తగా ప్లాట్లు కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. కొన్ని నిర్మాణాలు గోడలు పూర్తి చేసుకోవడం, మిగిలినవి స్లాబ్ లెవల్లో పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్ కొరత లేకుండా హౌసింగ్ అధికారులతో కలిసి పని చేయాలని కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. లే అవుట్ పరిశీలనలో కమిషనర్ వెంట డిఈ మహేష్, హౌసింగ్ సిబ్బంది, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS