SAKSHITHA NEWS

M.L.C. Commissioner Anupama Anjali inspected the polling center

ఎం.ఎల్.సి. పోలింగ్ పంపిణి సెంటర్ ను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : తిరుపతి నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న శాసనమండలి ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయడంతో బాటు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, శాసనమండలి ఎన్నికల నిర్వహణాధికారి అనుపమ అంజలి అన్నారు.

తిరుపతి శ్రీపధ్మావతి డిగ్రీ కళాశాల పిజి హాస్టల్ నందు మార్చి 13న నిర్వహించే శాసన మండలి పోలింగ్ కు అవసరమైన సామాగ్రీని భద్రపరిచి, పోలింగ్ ముందు రోజు సంబంధిత ఎన్నికల అధికారులకు, సిబ్బందికి పంపిణి చేసే కేంద్రాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ అనుపమ అంజలి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ ఎం.ఎల్.సి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, తిరుపతి నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లకు 25, టీచర్లకు 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు తగినన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, శాసనమండలి ఎన్నికల సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ అనుపమ అంజలి వెంట ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ జీవన్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS