తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఐదు గంటల నుండి మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను, కొన్ని ఏరియాల్లో పరిశుధ్యం, కొన్ని దుఖాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు.
తిరుపతి నగరంలోని తిరుచానూర్ రోడ్డు, రేణిగుంట రోడ్డు, ఓల్డ్ రేణిగుంట రోడ్డు, శ్రీనివాసపురం, నారాయణపురం సర్కిల్ మస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించడం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్లో ఓక బార్ వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లాసులు విక్రయిస్తూ కనబడడంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఐదు వేలు జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా రేణిగుంట రోడ్డులో రెండు దుఖాణాల ముందు చేత్త వేసి వుండడంతో ఆ రెండు దుఖాణాలకు రెండు వేలు చొప్పున కమిషనర్ ఆదేశాల మేరకు జరిమాన విధించడం జరిగింది.
శ్రీనివాసపురంలో పర్యటిస్తూ కాలువల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని, చెత్తను ఎక్కడంటె అక్కడ వేయకుండా, పారిశుధ్య సిబ్బందికి తడి,పొడి చెత్తను వేరు వేరుగా అందించాలన్నారు. కొన్ని దుఖాణాలను పరిశీలిస్తూ సింగిల్ యూజ్ నిషేదిత ప్లాస్టిక్ ఉత్పత్తులను అమ్మినా, ఉపయోగించిన జరిమానాలతో బాటు తగు చట్టబద్ద చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ సుమతి పాల్గొన్నారు.