వనపర్తి ఐకాన్ చుట్టూ వ్యాపార ఫ్లెక్సీలు,వాహనాల పార్కింగ్
పట్టించుకోని పాలకులు నిద్రపోతున్న అధికారులు.…. …….. బిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్
సాక్షిత వనపర్తి :
వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పట్టణ అభివృద్ధికి ఐకాన్ గా నిలిచే విధంగా శివాజీ విగ్రహం, సర్దార్ సర్వాయి పాపన్న ల విగ్రహాలను అలాగే వనపర్తి సమాచారాన్ని తెలియజేసే విధంగా వీడియో ప్రదర్శన రాత్రిపూట సుందరంగా కనిపించే విధంగా లైటింగ్ ఆహ్లాదకరమైన ప్రదేశంగా తయారు చేస్తే ప్రస్తుతం అక్కడ వ్యాపార ఫ్లెక్సీలు వాహనాల పార్కింగ్లు చిరు వ్యాపారస్తుల వ్యాపారం నిర్వహణతో ఆ ప్రాంతాన్ని గందరగోళంగా తయారు చేశారని ఇదంతా పాలకులు పట్టించుకోకపోవడం చేత, అధికారులు నిద్రావస్థలో ఉండడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొందని బిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ఐకాన్ అభివృద్ధికి భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో శిధిలమైన చెరువుల సుందరీకరణ ఆహ్లాదకరమైన వాతావరణ కోసం ఎకో పార్కు రోడ్ల వెంట గ్రీనరీ అన్ని పార్కుల అభివృద్ధి ని చేయడం జరిగిందని మీరు చేసే అభివృద్ధి దేవుడేరుగని చేసిన అభివృద్ధిని కాపాడాలని వారిని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు.