Commencement of Stambhadri Trade Fair Exhibition in Khammam
ఖమ్మం లో స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం
బుధవారం నాడు ఖమ్మం నగరంలోని పెవిలన్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార. అనంతరం ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలియజేశారు.
అనంతరం ఎగ్జిబిషన్ లో ఆటల వస్తువులను వీక్షించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు కరొన కోవిడ్ వల్ల ఎగ్జిబిషన్లు వంటివి ఏర్పాటు చేయలేదన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం పిల్లల ఆటల కొరకు ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసిన వారి బృందాని అభినందించారు. ఎగ్జిబిషన్ నందు చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు, స్టాల్స్ ఏర్పాటు చేయడం, ఎగ్జిబిషన్ నేటి 21/12/2022 నుండి 45 రోజుల వరకు ఉంటుంది,ఎగ్జిబిషన్ సమయం ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది.కావున నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో నాయకులు జాని, తిరుమల్ రావు, కోటి, మాటేటి కిరణ్, ఎగ్జిమిషన్ నిర్వాహకులు అప్పీ రెడ్డి, బాలా శౌరి, వాసు, అచ్చయ్య, నారాయణ, సురేష్, శ్రీనాథ్, మరియు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు