SAKSHITHA NEWS

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్

*
సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి నగరపాలక పరిధిలో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుమల బైపాస్ రోడ్డులోని మునిసిపల్ పార్క్ వద్ద తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ పనులను కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. కమాండ్ కంట్రొల్ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుందనే విషయాలని సాంకేతిక నిపుణులు కమిషనర్ కు వివరించారు. కాగా ఈ సెంటర్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని 100 స్మార్ట్ సిటీ ల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లు పనిచేస్తున్నాయని ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించనున్నారు. ఈ మేరకు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సెంటర్ ద్వారా నగరంలో చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతోంది, పారిశుద్ధ్య కార్మికుల హాజరు, ట్రాఫిక్ నియంత్రణ, యూజర్ చార్జెస్, నీటి సరఫరా విధానం, గాలి కాలుష్య నియంత్రణ, నగరప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం వంటివి నిర్వహించనున్నారు.
కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈ. మోహన్, ఏ. ఓ. రాజశేఖర్, సాంకేతిక నిపుణులు రషీద్, సాయి, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS