కాలనీ లలో ఉన్న సమస్యల పరిష్కార ధ్యేయమే కాలనీ కాంటాక్ట్ ప్రోగ్రాం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్, HMT హిల్స్ కాలనీ, తులసి నగర్ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీల లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి సుమారు 15 డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కానీలలో పర్యటించి సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుంది అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకొని మన కాలనీ లను, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేశారు,
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, అధికారులు ఏఈ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, దేవి, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫ్ఫా, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ సుధాకర్, హరికల్చర్ దాసు, ఎస్ఎఫ్ఏ లు భరత్ కాలనీ వాసులు గాంధీ రావు, శ్రీహరి, ఎస్ఎం బాబు, కెఎస్ఆర్ మూర్తి, రామచంద్ర రెడ్డి, ప్రసాద్, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ, మోహన్ రావు, రామ కృష్ణయ్య, మోహన్ కెబి చారీ, బాలనర్సయ్య, ఎల్లయ్య, సంజీవ రావు, గోపాల్ కృష్ణ, జనార్దన్ రెడ్డి, వెంకట నారాయణ, కిరణ్ కుమార్, రవి కుమార్,ఆంజనేయ రాజు, మురళి, శ్రీనివాస రావు, దినేష్, నారాయణ రాజు, బలరాం, యాదగిరి రెడ్డి, గంగాధర్ రాజు, రవీంద్ర బాబు, చంద్ర శేఖర్, శంకర్ రెడ్డి, రామ కృష్ణ, ఎల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.