SAKSHITHA NEWS

వినికొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శావల్యాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం లిమిటెడ్.వారు సుమారు 6 కోట్ల 65 లక్షల రూపాయల తో నిర్మించిన వేల్పూరు గ్రామ శీతల గిడ్డంగి కేంద్రం (కోల్డ్ స్టోరేజ్) ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయులు , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు , జిడిసిసి బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు , అప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ , పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ . వారితో పాటు సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

ముందుగా సభాధ్యక్షులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, భారతదేశంలోనే సహకార రంగంలో మొదటిసారిగా గ్రామీణ ప్రాంతంలో ఈ కోల్డ్ స్టోరేజ్ని నిర్మాణం చేసుకొని, ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ ను నూతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు… అలాగే ఈ గిడ్డంగు ల్లో కూడా రైతులకు అందుబాటు ధర లోనే అతి తక్కువ ధరలకే రైతులు తమ పండించిన పంటలను ఈ స్టోరేజ్ నందు నిలువ చేసుకోవచ్చని అలాగే జి డి సి సి బ్యాంకు ద్వారా కోల్డ్ స్టోరేజ్ నందు నిల్వ చేసిన తమ పంటలకు సులభంగా రుణాలు పొందవచ్చునని ఆయన తెలిపారు.

అనంతరం నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ, ఈ శీతలగిడ్డంగిని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఈ సహాకార సంఘాల ద్వారా రైతులకు అనేక రకాల ప్రయోజకత్వం ఉందని అన్నారు. అలాగే మన నియోజకవర్గంలోని వరికపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణపనులకు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేశారని గుర్తుచేశారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే మెట్టమెదటి సారిగా సహాకార సంఘం చే కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి దక్కుదని అన్నారు. సుమారు6 కోట్ల 65 లక్షల రూపాయల తో నూతన పరిజ్ఞానం తో ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానం చేయటం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్రం లోనే అధిక గోదాములు నిర్మించటంలో వినుకొండ 3వ స్థానం లో ఉందని ప్రశంసించారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అని, అలాగే రైతుల మంచి కోరే ముఖ్యమంత్రులలో ఆనాడు వైయస్ రాజశేఖర రెడ్డి గారైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ని తెలిపారు. రైతుల కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించి, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ వారు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

సభ అనంతరం అతిధులను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సన్మానించారు.


SAKSHITHA NEWS