SAKSHITHA NEWS

ములుగు జిల్లా:
మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు.

ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకున్నారని సీతక్క తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అని,తెలిపారు.

కాగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వచ్చారు అన్నారు.ఈరోజే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ ఉదయం 10 గంటలకు మేడారం చేరుకుని సభకు నివాళులర్పిస్తారని సీతక్క తెలిపారు.

ఈ జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా హాజరవు తారని మంత్రి సీతక్క తెలిపారు. ప్రముఖుల రాకకు వీలులేని మేడారంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని సీతక్క తెలిపారు. కాగా.. ఇతర ప్రముఖులు వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

అదే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సారలమ్మ, పగిద్ద రాజు అడవి నుంచి పొలాలకు చేరుకున్నారు. వనదేవ తలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తొలిరోజు మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

WhatsApp Image 2023 12 30 at 11.38.13 AM

SAKSHITHA NEWS