మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్: అలయ్ బలయ్‌లో దత్తాత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహకులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వస్తానని చెప్పి… వచ్చి సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రేవంత్ ఆత్మ విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి అని, జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగారని కొనియాడారు. అలయ్ బలయ్ కి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పర అవగాహన తో పని చేయాలని సూచించారు. వారు అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని, ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్లాలని చెప్పారు.హర్యానాకి గవర్నర్ ఐనా.. తెలంగాణ బిడ్డను నేను అని అన్నారు. చేతివృత్తులు ఈ కార్యక్రమంలో
ప్రదర్శించామని, వాటిని కాపాడుకోవాలని
పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో సీఎం
రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వివిధ
రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయశంకర్,
గుర్మిత్ సింగ్, వివిధ పార్టీల కీలక నేతలు
హాజరయ్యారు.