CM KCR’s aim is to make people of all communities highly educated.cm
అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం…
నిజాంపేట్ లో సీఎస్ఆర్ నిధులు రూ.17 కోట్లతో నిర్మిస్తున్న గురుకుల మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు, ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ నిజాంపేట్ లో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా రూ.17 కోట్ల నిధుల ద్వారా నూతనంగా చేపడుతున్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట) భవన నిర్మాణ పనులకు
మంత్రులు కొప్పుల ఈశ్వర్ , మల్లారెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , హెచ్ఏఎల్ డైరెక్టర్ అలోక్ వర్మ , హెచ్ఏఎల్ ఏవీయనిక్స్ డివిజన్ జిఎం అర్జున్ జె సర్కటే , టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ ఐఎఎస్ , టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ ఈఈ కుమార్ గౌడ్ , జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డి , స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో సీఎం కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారన్నారు. వెయ్యి గురుకులాలలో సుమారు 6 లక్షల మందికి ఇంగ్లిష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
అమ్మాయిలు తమ చదువులను మధ్యలోనే ఆపేయకుండా నిరాఘాటకంగా కొనసాగించేందుకు ప్రత్యేకంగా 30 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జగద్గిరిగుట్ట పాఠశాల, కాలేజీకి శాశ్వత భవనాన్ని సమకూర్చేందుకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హెచ్ఏఎల్ ముందుకు వచ్చి రూ.17కోట్లు మంజూరు చేయడం, నేడు శంఖుస్థాపన చేయడం సంతోషదాయకమన్నారు.
మరిన్ని సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెచ్‌ఏఎల్ అధికారుల సేవాభావాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్ మరియు అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు