CM KCR who is fulfilling all the aspirations of the youth should prosper for a hundred years.
యువత ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ నూరేళ్లూ వర్ధిల్లాలి.
ఎమ్మెల్సీ తాతా మధు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన చింతనిప్పు కృష్ణచైతన్య
300 మంది బాలింతలకు, రోగులకు అన్నదానం.
జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
యువత ఆకాంక్షలన్నింటిని నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని , సీఎం కేసీఆర్ నూరేళ్లూ వర్ధిల్లాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించి అనంతరం ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర సాధన కల సాకారం చేసిన కెసిఆర్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుంటున్నదని తాతా మధు తెలిపారు. యువతకు ఐటి రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగాల ప్రకటన ద్వారా ఉపాధి మార్గాలను చూపి ఆర్థికంగా స్థిరపడేలా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో బిఆర్ఎస్ యువజన విభాగం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుంద న్నారు.
బిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో యువజన విభాగం ప్రత్యేకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తున్నదని వివరించారు. తమ యువజన సంఘం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను తమ సంఘం ప్రజలకు సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు తో కలిసి చింతనిప్పు కృష్ణ చైతన్య సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ , కార్పొరేటర్ కమర్తపు మురళి , ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాటేటి కిరణ్, చిక్కళ్ళ వెంకటేష్, కొమ్ము విజేత పాల్గొన్నారు.బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.