SAKSHITHA NEWS

CM KCR Rajyashyamala Yagam for Rajyoga.

రాజయోగం కోసమే సీఎం కేసీఆర్ రాజ్యశ్యామల యాగం..!

ఈనెల ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా రాజ్యశ్యామల యాగాన్ని తలపెట్టారు. గతంలో మొదట 2014లో సీఎం కేసీఆర్‌ రాజ్యసమల యాగం చేశారు. మళ్లీ 2018లోను యాగం చేసి తెలంగాణలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందుకు గాను ఆయన మరోసారి రాజశ్యామల యాగాన్ని నమ్ముకున్నట్లుగా కనిపిస్తుంది.

ఈమేరకు ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ, రేపు యాగాలు పూజా కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ఇప్పటికే యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు పూర్తయింది. ఈ పూజల్లో భాగంగా నవ చండీ హోమము,రాజశ్యామల హోమం, పూర్ణాహుతి ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరగనున్నాయి.

రాజశ్యామల యాగం ద్వారా వ్యాపారంతో పాటు డబ్బు, అధికారాన్ని సొంతం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే రాజా శ్యామల యాగం రెండు పద్ధతుల్లో నిర్వహిస్తారు. మొదటిది వామాచార పద్ధతి దీనిలో ప్రధానంగా పూలు పండ్లతో ప్యూర్ శాకాహార పద్ధతిలో యాగం నిర్వహిస్తారు.

రెండోది దక్షిణాచార పద్ధతి.. దీనిలో మద్యం, మాంసం వినియోగిస్తారు. దీని ద్వారా విపరీతమైన రాజ యోగం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ పద్ధతిని ప్రధానంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐఏఎస్ ఐపీఎస్, లాంటి రాజయోగులు ఎక్కువగా ఈ పద్ధతిని అనుసరిస్తూ రాజమాతంగిని పూజిస్తారని వేద పండితులు చెబుతున్నారు.

ఈ పద్ధతిలోనే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఈ యాగాన్ని చేశారని పండితులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు సినిమా రంగంలో కూడా ఈ యాగాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారని గతంలో ఈ పూజలు నిర్వహించిన పూజారులు గుర్తు చేస్తున్నారు.


SAKSHITHA NEWS