ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు …
లింగాల మండలంలో 64 కళ్యాణ లక్ష్మి చెక్కులు లింగాల:- పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఆ కుటుంబాలకు తోడుగా ఉంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం లింగాల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 64 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి రూ.100116/- అందించి ఆ కుటుంబానికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెదింటి ఆడపడుచుల కళ్యాణం ఏ యొక్క కుటుంబంలో ఆర్థిక భారం కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కల్యాణలక్ష్మి ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి ఒక మేనమామగా కేసీఆర్ నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.