మహిళా విద్యార్ధీనీలపై నీచంగా భౌతిక దాడికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులను శిక్షించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు
హైదరాబాద్:
అర్ధరాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యా ర్థులపై ఎబివిపి దాడికి పాల్పడ్డారు. సుమారు 100 మంది మతోన్మాద మూకలు విద్యార్ధులపై దాడి చేశారు.
గత రెండు రోజుల క్రితం పిడబ్యూడి విద్యార్ధిపై దాడి చేసిన ఎబివిపి చేయలేదని అబద్దాలు ప్రచారం చేసింది. ఎబివిపి అబద్ధాలను ఎస్ఎఫ్ఐ సాక్ష్యాలతో సహా నిరూపించింది, కావాలనే దివ్యాంగ విద్యార్ధిపై దాడి చేసిందని నిరుపించడంతో విద్యార్థులలో స్థానం కోల్పోయిన ఎబివిపి మళ్ళీ దాడికి ప్లాన్ చేసి అర్ధరాత్రి హస్టల్స్ దూరి దాడికి పాల్పడింది.
దాడి చేయకుండా అడ్డుకు న్న యూనియన్ అధ్యక్షుడు అతీక్, ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి కృపాజార్జీ మరియు మరో 20 మంది విద్యార్ధులపై దారుణంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిలను సైతం జుట్టు పట్టుకుని ఈడ్చి దాడిచేసి గాయపర్చారు.
గాయాలపాలైన విద్యార్ధు లను అంబులెన్స్ ద్వారా హెల్త్ సెంటర్ కు తరలి స్తుంటే అంబులెన్స్ హస్పి టల్ వెళ్ళకుండా అడ్డుకోని అంబులెన్స్ లోని వారిపై దాడికి పాల్పడలని ప్రయత్నం చేశారు.
సెక్యూరిటి, ఇతర విద్యార్థు లను సైతం భయబ్రాంతుల కు గురిచేస్తూ దాడులు చేశా రు.వారికి వారే గాయాలు చేసుకోని ఎస్ఎఫ్ఐ తమపై దాడి చేసిందని అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు.
ప్రశాంతంగా భిన్న అభిప్రా యాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హెచ్.సి.యు. క్యాంపస్ లో విద్వేషాలు, దాడులు చేసే సంస్కృతిని ఎబివిపి తీసుకుని వస్తుంది. వరుసగా క్యాంపస్ లో విద్యార్థుల నుండి తిరస్కరణ గురైతున్న ఎబివిపి ఎస్ఎఫ్ఐ పై దాడులు చేసి బెదిరింపులు గురిచేయాలనుకుంటుంది.
ఎబివిపి దేశంలో యూనివ ర్శీటీలలో మీరు ఎన్ని దాడులు చేసిన నికరంగా విద్యార్థులు సమస్యలపై పోరాటం ఆపని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యద ర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు తెలిపారు.
అత్యంత నీచంగా మహీళ విద్యార్థులపై దాడి చేశారు. నిత్యం భారతమాత జై అంటున్న ఎబివిపి మహీళ లపై దాడుల చేయడమేనా మహీళలకు ఇస్తున్న గౌవరం అని పశ్నించారు.
ఈ దాడిని విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు,ఖండించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ కోరుతుంది. దాడికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఎస్ఎఫ్ఐ పిలుపుస్తున్నట్లు తెలిపారు.