SAKSHITHA NEWS

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!!

సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి upsc.gov.in తమ అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేయగలరు.
అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్, upsconline.nic.in సంప్రదించగలరు. సివిల్స్ మెయిన్స్ అడ్మిట్‌కార్డులు సెప్టెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగగా, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

యూపీఎస్సీ 1056 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14వ తేదిన ప్రారంభమయ్యి, మార్చి 5వ తేదిన ముగిసింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 16, 2024 న నిర్వహించారు. వీటి ఫలితాలను జూలై 1, 2024 విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మాత్రమే మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తారు. రాత పరీక్షలో తొమ్మిది సంప్రదాయ వ్యాస పత్రాలు ఉంటాయి. వీటిలో రెండు అర్హత పరీక్షలు.. వివిధ సర్వీసులు, పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం..

అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను upsc.gov.in సంప్రదించాల్సి ఉంటుంది. అనంతరం హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సబ్‌మిట్ అనే ఆఫ్షన్‌పై క్లిక్ చేస్తే అడ్మిట్‌కార్డు డిస్‌ప్లే అవుతుంది.

అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని మీ భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోగలరు.


SAKSHITHA NEWS