CITU leaders demand that the worker be employed
కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలో లస్మక్కాపల్లి గ్రామపంచాయతీలో తొలగించిన కార్మికుడిని పనిలోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు
తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం,ఆధ్వర్యంలో లస్మక్కాపల్లి గ్రామపంచాయతీలో తొలగించిన కార్మికుడిని పనిలోకి తీసుకోవాలని, అలాగే మండలము లోని పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఎంపీడీవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తొలగించిన కార్మికుని సమస్య ను, సర్పంచ్ తో మాట్లాడి పరిష్కారం, చేస్తామని, MPO అలాగే పెండింగ్ ఉన్నా గ్రామా పంచాయితి కార్యదర్శులతో మాట్లాడి జీతాలు వచ్చే విదంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగ యూనియన్ జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ కార్మికుని పనిలోకి తీసుకునే వరకు పోరాడుతామని,అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ ఈ స్ఐ సౌకర్యాలు అందించాలని, ప్రజా ప్రతినిధులు వారి ఇష్టానుసారంగా కార్మికులను తొలగిస్తే కోరుకునేది లేదని, గత 20 రోజులుగా గ్రామపంచాయతీ ముందు నిరసన దీక్ష చేస్తున్న కార్మికునికి సిఐటి అనుబంధ సంఘాలన్నీ అండగా ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్, జిపి యూనియన్ మండల అధ్యక్షులు మహంకాళి కొమురయ్య, జిల్లా కమిటీ సభ్యులు కదం కిషన్ రావు, ఖండే సదయ్య, కార్మికులు దాసరపు మల్లయ్య, రమేష్, శంకర్, వెంకటేష్, చంపయ్య, గుడిసెల కొమురయ్య, కర్రె లచ్చయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.