SAKSHITHA NEWS

CITU leaders in front of Tandoor mandal MPDO office

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపైన తాండూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు CITU నాయకుల ధర్నా

తాండూర్ మండలం(సాక్షిత న్యూస్ సెప్టెంబర్ )మండలం తాండూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు,గ్రామ పంచాయాతి కార్మికుల సమస్యలపైన, CITU నాయకులు,కార్మికులు ధర్నా నిర్వహించారు, ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు K. శ్రీనివాస్ మాట్లాడు తూ, తెరాస ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు, కనీస వేతనం నెలకు 15500రూపయాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆలా గే గుర్తింపు కార్డులు తప్పకుండా ఇవ్వాలని, అనేక గ్రామ పంచాయతీ లలో 8500 ఇవ్వకుండా, అతి తక్కువ వేతనాలు ఇస్తు,కార్మికులను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందన్నారు, గ్రామ లలో రాజకీయ వేధింపులు కార్మికులను చేయడం జరుగుతుందన్నారు, ఈ వే ధింప్పులువెంటనే ప్రభుత్వం అరికట్టాలని, కార్మికుల సమస్యలు పరిస్కరించాలని ప్రభుత్వము ను డిమాండ్ చేశారు,సమస్యలు పరిస్కారం చేయకుంటే కార్మికులు తిరగ భడే రోజు వస్తుందని,ప్రభుత్వం పూర్తి భాధ్యత వహించాలని తెలిపారు,ఈ కార్యక్రమం లో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS