SAKSHITHA NEWS

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం

— ఘనంగా మేడే దినోత్సవం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఎం, సిఐటీయు నాయకులు జిట్ట నగేష్, నారబోయిన శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చిట్యాలలో సోమవారం నాడు జరిగిన మేడే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. 8గంటల పని దినాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం చట్టాలను మార్చి, పన్నెండు గంటలకు పొడిగించాలనే ప్రయత్నాలు విరమించు కోవాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా సిఐటీయు ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం జండాలను పార్టీ నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పామనుగుల్ల అచ్చాలు, అరూరి శీను,జిట్ట సరోజ లు ఆవిష్కరించగా, సిఐటీయు జండాలను జిల్లా ఉపాధ్యక్షులు నారబోయ్న శ్రీనివాస్ లు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ఏనుగు వెంకట్ రెడ్డి, రైస్ మిల్లు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఏళ్ళ మారయ్య, విఓఏ యూనియన్ అధ్యక్షురాలు ఎదుళ్ల లక్ష్మి, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు యం డి అజిత్, హమాలి యూనియన్ అధ్యక్షులు దూడల యాదయ్య, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బందెల యాదగిరి, ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు మేడి దుర్గయ్య లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఐతరాజు నర్సింహ, మెట్టు పరమేష్, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, రుద్రారపు పెద్దులు, కడగంచి నర్సింహ, పాల లక్ష్మయ్య, రమేష్, మేడి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS