SAKSHITHA NEWS

ఈ నెల 25, 26 వ తేదీలలో నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించే సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంప్ లో అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు

కమిషనర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చుటకు “సిటిజన్ ఔట్ రిచ్ క్యాంపెయిన్” కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో శుక్ర,శని వారాల్లో వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు వార్డు సచివాలయ పరిధిని పరిగణలోనికి తీసుకుని ప్రతి క్లస్టర్ నందు 50 ఇండ్లకు ఒక్క టీం గా ఏర్పాటు చేశామని అన్నారు. వీరు ప్రతి ఇంటికి ఆధార్ సర్వీసుల పైన అవగాహన, మునిసిఫల్ సర్వీసుల పై అవగాహన వెల్ఫేర్ క్యాలెండర్, సచివాలయం సెక్రటరీ ఫోన్ నెంబర్లు వివరములు,మీసేవ మరియు నాన్ మీసేవ సర్వీసెస్ ఫై తెలియపరుచుట మరియు ప్రభుత్వ పథకములకు సంబంధించి దరఖాస్తు చేసుకొను విధములపై వార్డ్ మొత్తం పర్యటించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS