SAKSHITHA NEWS

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?
ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖను నాగబాబుకు కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ శాఖలు జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. ఈ శాఖలు నాగబాబుకు అప్పగించి దుర్గేష్‌కు గనుల శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం.


SAKSHITHA NEWS