SAKSHITHA NEWS

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: సీఐ వినోద్

మంగళగిరి పరిధి రత్నాల చెరువులో బహిరంగంగా మద్యపానం సేవించే వారికి మంగళగిరి పట్టణ సిఐ వినోద్ కుమార్ రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగంగా మద్యపానం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే జరిగే నష్టం వెలకట్టలేనిదని అన్నారు. బహిరంగ మద్యపానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు


SAKSHITHA NEWS