మద్యం సేవించి వాహనాలు నడపరాదు – సీఐ శివరాం రెడ్డి
— డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే కేసులు నమోదు చేస్తాం
— చిట్యాల లో వాహనాల తనిఖీలు
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని నార్కట్ పల్లి సిఐ శివరాంరెడ్డి, చిట్యాల ఎస్సై ఎన్ ధర్మ హెచ్చరించారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో చేపడుతున్నామని తెలిపారు. చిట్యాల కూడలిలో తమ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలను డ్రైవింగ్ చేయవద్దని వారు హెచ్చరించారు. అలాగే వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడపకూడదని చిన్న తొందరపాటు వల్ల జీవితాలను చీకటి చేసుకోవద్దని వాహనదారులకు సూచించారు.