పెద్దపెల్లి జిల్లా :
గతంలో వివాదాస్పద చరిత్ర ఉన్నవారు పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని సుల్తానాబాద్ సీఐ జగదీష్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ జగదీష్ మాట్లాడుతూ.. రౌడీషీటర్స్, సస్పెక్ట్ షీటర్లకు నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. గతంలో నేర చరిత్ర ఉండి కేసులు నమోదయి జైలుకు వెళ్లివచ్చినవారు సత్ప్రవర్తనతో ఉండాలన్నారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఇటువంటి వారిపై పోలీసులు డేగ కన్ను ఉంటుందని వారి కదలికలపై నిఘా ఉంటుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విజయేందర్, వెంకటకృష్ణ, రామకృష్ణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు….
పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు* సీఐ జగదీష్
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…