సాక్షిత : అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన కార్పొరేటర్లు చిట్ల దివాకర్, రజిత రవి కాంత్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో శ్రీనివాస నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప దీక్షదారులకు 2&9వ డివిజన్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, రజిత రవి కాంత్ అన్న దానం జరిగింది. అనంతరం అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు 2&9వ డివిజన్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, రజిత రవి కాంత్ ఇద్దరు కలిసి ఒక్క మెట్టుకు 1,00,000/రూ విరాళము ను శ్రీనివాస నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి అందచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కాంత్, దాతలు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, నల్లాది హరి , దీక్షదారులు , తదితరులు పాల్గొన్నారు.