Children’s Day is celebrated at Smart Kidz School
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని
బాలల దినోత్సవాన్ని నగరంలోని”స్మార్ట్ కిడ్జ్” పాఠశాల యందు ఘనంగా నిర్వహించారు. వివిధ వేషధారణలతో దేశానికి సేవ చేసిన నాయకుల వస్త్రధారణతో వచ్చిన విద్యార్థులు పలువురుని ఆకర్షించారు.
అదేవిధంగా దేశభక్తిని చాటే పాటలకు నృత్యాలు చేస్తూ బాలల దినోత్సవంలో చిన్నారులు కేరింతల నడుమ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో బాలలదే కీలకమైన పాత్ర అని విద్యార్థి దశ నుండే దేశానికి సేవ చేసే నాయకత్వాన్ని అలమరుచుకోవాలని, దేశం పై మమకారం అభిమానం చిన్ననాటి నుండే పొందాలని ఆయన అన్నారు.
బాలల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయాల్సిన అవసరం ఉందని, వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా సమాజంలో మార్పులు రావాలని, జ్ఞానం,విద్య నేర్చుకోవడం ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల కార్యక్రమాలలో అదేవిధంగా నృత్యాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ మరియు పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.