SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి నీరు పేదలకు గొప్పవరం ….. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన బాధితులకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- , ల సీఎం సహాయనిధి నుండి (CMRF) ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి 125,126,131 డివిజన్ల లోని చెందిన వాసులు మల రావు, కర్రీ సత్యనారాయణ, వీణ మరియు లక్షమ్మ కు రూ 60,000/- ( ఆరవై వేల రూపాయలు ) CMRF-మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, బోయిని వెంకటేష్ , డివిజన్ అధ్యక్షులు లాయక్, గణేష్ మరియు నాయకులు జీవన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బుచ్చి రెడ్డి వేణు గౌడ్, గఫ్ఫార్, మధుసూదన్ రెడ్డి, అజయ్, అరుణ్, ప్రశాంత్ రెడ్డి, శ్యామల, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS