SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి క్షుద్ర రాజకీయాలు
దుర్యోధన అహంకారం మానుకోవాలి

భేషరతుగా సబితకు క్షమాపణ లు చెప్పాలి……….. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్

*సాక్షిత వనపర్తి :
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి స్థానానికి స్థాయికి వన్నె తేవాల్సింది పోయి కలంకం తీసుకొచ్చే విధంగా ఆయన తీరు ఉందని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్ర రెడ్డి సునీత లక్ష్మారెడ్డి లను అసభ్య పదజాలాలతో అవమానించడాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేసరత్తుగా మహిళా శాసనసభ్యులకు ముందుగా క్షమాపణలు చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోటములు వ్యక్తి కైనా పార్టీలకైనా సహజంగా ఉంటాయని గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓడిపోయినప్పుడు కృంగిపోయే వ్యక్తులు రాజకీయాలకు సరిపోరని అన్నారు 2003 నవంబర్ 13న మహబూబ్నగర్ బహిరంగ సభలో కెసిఆర్ ముందే తానే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తే ఆ తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల కు మారలేదా అని నీ మాదిరే వారి వారి పరిస్థితులను బట్టి పార్టీలు మారడం సహజమని 2018లో కొడంగల్ నుండి పోటీ చేస్తూ ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి ఓటమి పాలైనప్పటికీ అక్కడి నుండి వెళ్లి మల్కాజ్గిరి నుండి పార్లమెంటుకు పోటీ చేయలేదా అని విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నట్లు ఎందుకు చెప్పుకోవడమని ఎద్దేవ చేశారు అనుకోకుండా అంది వచ్చిన అవకాశం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోఅధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి పదవి వరించడం సంతోషించకపోగా అహంకారంతో చిన్న పెద్ద తేడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు తోటి శాసనసభ్యులు అన్న తేడా లేకుండా ప్రాస కోసం ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడడం దుర్యోధన అహంకారాన్ని తలపిస్తోందని దీన్ని ముఖ్యమంత్రి మానుకోవాలని కోరారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేవంద రోజుల్లో ఆరు గారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న రైతుబంధు ఎక్కడ అని రుణమాఫీ ఆచరణలోనే ఉందని అంగన్వాడీలు,ఆశా కార్యకర్తలు, నిరుద్యోగులు, మహాలక్ష్మి పెన్షన్ దారులు ఉద్యమాలు చేస్తూ రోడ్లపైనే ఉన్నారని ఇక రైతులు సరే సరే అనిపాత పెన్షన్ దారులు కల్యాణ లక్ష్మి పాతవే దిక్కు లేదని తులం బంగారం వీటన్నిటి కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీదే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రంగాలి మాయ మాటలు చెబుతూ ప్రజల్ని మభ్య పెట్టేందుకు రాష్ట్రంలోక్షుద్ర రాజకీయాలు చేస్తోందని అలాంటి రాజకీయాలను మానుకోవాలని ఆయన సిఎంను కోరారు లేకపోతే పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి పదవి లో కొనసాగడం కష్టంగా మారుతుందని మీ వాళ్లే నిన్ను పదవి నుండి తొలగించే పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్. అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్
బి లక్ష్మయ్య మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కౌన్సిలర్ నాగన్న యాదవ్ కంచరవి తిరుమల యాదవ్ మహిళా నాయకులు జములమ్మ కవిత నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 08 01 at 18.52.50

SAKSHITHA NEWS