SAKSHITHA NEWS


Chief Minister KCR is a farmer’s relative: Minister Harish Rao

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి హరీశ్‌ రావు

మెదక్: రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా అందిచామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతులకు రైతుబంధు జమచేశామన్నారు.

ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్‌డ్యామ్‌లపై నుంచి మత్తడి దూకుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో తూప్రాన్‌లో మూడు మార్కెట్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నవారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.


SAKSHITHA NEWS