SAKSHITHA NEWS

చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం.

శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.

ఎమ్మెల్యే శ్రీ అరెకపూడి గాంధీ

కారు గుర్తుకే ఓటేద్దాం బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతుకై వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షాపుల్లర్స్ (RP) కాలనీ మరియు పలు కాలనీలలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసాని ని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దాం అని ఎమ్మెల్యే గాంధీ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని పేదలకు అందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ఎమ్మెల్యే గాంధీ గాంధీ తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని ఈ విజయం ను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే తెలియచేసారు. కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అని , బీసీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ,సమిష్టి కృషి తో పని చేద్దాం అని , అఖండ మెజారిటీ తో కాసాని ని గెలిపిద్దాం అని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

WhatsApp Image 2024 04 25 at 5.59.18 PM

SAKSHITHA NEWS